జాతీయ వార్తలు

“జీడీపీ కుప్పకూలింది – మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా దివాలా తీసింది”: కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

భారత దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా తరవాత మొదటిసారి గణనీయంగా మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటు కేవలం 6.5% వద్ద నిలిచింది. ఇది గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయిగా నమోదు కాగా, కాంగ్రెస్ పార్టీ ఈ గణాంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా (@INCIndia) ద్వారా చేసిన వ్యాఖ్యలో ఇలా పేర్కొంది: భారత దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా తరవాత మొదటిసారి గణనీయంగా మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటు కేవలం 6.5% వద్ద నిలిచింది. ఇది గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయిగా నమోదు కాగా, కాంగ్రెస్ పార్టీ ఈ గణాంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది.

‘అచ్చె దిన్’ అనే కలల మాటలతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ, దేశ ఆర్థిక వ్యవస్థను బూడిద చేస్తూ ఉన్నారు. ఇప్పటి జీడీపీ గణాంకాలు దీని తేలికపాటి ఉదాహరణ మాత్రమే.

జీడీపీ మందగించిన ప్రభావాలు – కాంగ్రెస్ విశ్లేషణ:

కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, జీడీపీ వృద్ధిరేటు తగ్గిన ప్రభావాలు భారత ప్రజలపై ఇలా పడుతున్నాయని చెప్పింది:

  • దేశంలో పరిశ్రమలు నిలిచిపోతున్నాయి
  • ఉద్యోగావకాశాలు తీవ్రంగా తగ్గిపోతున్నాయి
  • నూతన ఉద్యోగాలు సృష్టి కాలేకపోతున్నాయి
  • ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో జీవనం గడుపుతున్నారు

ఈ విమర్శల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను “ఆర్థిక అస్తవ్యస్తతకు” బాధ్యుడిగా నిలిపింది. దేశం అభివృద్ధికి కాకుండా పేదరికపు దిశగా పోతున్నదని, ఇది “మోదీ పాలన ఫలితమే” అని స్పష్టం చేసింది.

“మిత్రుల కోసమే పాలన?” – కాంగ్రెస్ ఆరోపణ

పేదలు, మధ్యతరగతి వర్గాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో మోదీ తన మిత్రులకు వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కట్టబెడుతున్నారని, వారిని భారతదేశపు అత్యంత సంపన్నులుగా తయారు చేస్తున్నారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ చేసింది.

దేశానికి ఏమవుతోందన్న సంగతి మోదీకి పట్టదు. ఆయన తన మిత్రుల బాగోగులే చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *