బిజినెస్ వార్తలు

బంగారం ధర తగ్గుదల: మహిళలకు ఊరట

2025 జూన్ 2 సోమవారం నాటి ఉదయం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గతవారం కొన్ని రోజుల పాటు ధరలు హెచ్చుతగ్గులు చూపిన తర్వాత నేడు కొన్ని రూపాయల తేడాతో స్థిరంగా కనిపించాయి. ప్రస్తుతం బంగారం తులం ధర ₹97,300గా ట్రేడవుతోంది. ఇది మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు ఎగబడి ఉన్న కాలంలో.

దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు ₹9,730గా ఉండగా, 22 క్యారెట్ల ధర ₹8,919లు, 18 క్యారెట్ల బంగారం ధర ₹7,298గా ఉంది. ఈ ధరలు స్వల్పంగా కిందకు వచ్చినప్పటికీ, మార్కెట్‌లో పసిడి మీద ఆసక్తి తగ్గలేదు.

ముఖ్య నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):

  • హైదరాబాద్: 22 క్యారెట్లు – ₹89,190 | 24 క్యారెట్లు – ₹97,300
  • విజయవాడ: 22 క్యారెట్లు – ₹89,190 | 24 క్యారెట్లు – ₹97,300
  • విశాఖపట్నం: 22 క్యారెట్లు – ₹89,190 | 24 క్యారెట్లు – ₹97,300
  • నిజామాబాద్, వరంగల్, ఖమ్మం: అన్ని నగరాల్లో ఒకే ధరగా ఉంది
  • బెంగళూరు, ముంబై, చెన్నై: 22 క్యారెట్లు – ₹89,190 | 24 క్యారెట్లు – ₹97,300
  • ఢిల్లీ: 22 క్యారెట్లు – ₹89,340 | 24 క్యారెట్లు – ₹97,450

నేటి వెండి ధర:

వెండి ధర కూడా స్వల్ప తగ్గుదలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక గ్రాము వెండి ధర ₹110.80గా ఉండగా, కిలో వెండి ధర ₹1,10,800గా ఉంది. వెండి మార్కెట్‌లో సైతం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

కొనుగోలు చేసే ముందు ధరలు చెక్ చేయండి!

బంగారం కొనాలనుకునే వారు, స్థానిక షాపుల్లో ధరలు మరియు మేకింగ్ ఛార్జీలు తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేయడం మంచిది. ఆన్‌లైన్ ధరలు రోజువారీగా మారుతున్న నేపథ్యంలో ప్రతి రోజు రేట్లు చెక్ చేయడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *