వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు: అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టిన చంద్రబాబు ప్రభుత్వం?
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల ఊబిలోకి నెట్టారని, అభివృద్ధి లేదనీ, సంక్షేమం కనపడటం లేదనీ జగన్ ఆరోపించారు.
జగన్ తన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ: ఈ ప్రభుత్వం ఇప్పటివరకే వేల కోట్లు అప్పు తీసుకుంది. కానీ నేల మీద ఒక్కడికైనా ఉపయోగపడే పనులు మొదలయ్యాయా? సంక్షేమ పథకాలైనా ప్రారంభమయ్యాయా? కేవలం మీడియా గోలే మిగిలింది,” అని ఆయన మండిపడ్డారు.
అంతేకాదు, జగన్ ఇసుకమాఫియా, మద్యం మాఫియాలు మళ్ళీ చెలరేగిపోతున్నాయంటూ ఆరోపించారు. పోలీసులు స్వయంగా వసూళ్లలో భాగస్వామ్యులు కావడం మనం చూస్తున్నాం. ఇదేనా పాలన?” అని ప్రశ్నించారు.
రాజకీయ పరిశీలకుల విశ్లేషణ:
ఓ వైపు విమర్శలు, మరోవైపు సంకేత కార్యక్రమాలు… కొత్త ప్రభుత్వం తన ఇమేజ్ను నిరూపించుకోవడంలో శ్రమిస్తున్నట్టే కనిపిస్తోంది. జగన్ చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ వాదనల కోణంగా చూస్తారా, లేక నిజంగా ప్రభుత్వ పాలనలో లోపాలుగా భావించాలా అన్నది ప్రజల తీర్పుపైనే ఆధారపడనుంది.
